జేఎన్టీయూ డిఈ ఈ డిపిఏ లక్ష్మి
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: మనసులో సంకల్పం బలంగా ఉంటే విజయాలను సొంతం చేసుకోవచ్చని.. .చదువుకున్న కళాశాలలోనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ..పదోన్నతి సాధించి. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా దోర్నదల పద్మ ఏకాంబరి లక్ష్మి విజయ శిఖరాలను అధిరోహించి యువతకి మార్గదర్శకంగా నిలిచినది. విశాలాంధ్ర ప్రత్యేక ఇంటర్వ్యూ లో డి ఈ ఈ మాట్లాడుతూ..గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే.. మూడు సంవత్సరాల చిన్నారిని స్కూలుకు ఒకవైపు పంపిస్తూ.. మరోవైపు తాను చదువుల తరగతి జేఎన్టీయూ అనంతపురంలో 2001 నుంచి 2005 వరకు బిటెక్ ,2005-2007 ఎంటెక్ విద్యాభ్యాసాన్ని పూర్తి . 2007 -2008 వరకు టీచింగ్ అసిస్టెంట్ గా, అనంతరం ఆర్ అండ్ బి లో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహించి సుదీర్ఘ సేవలను అందించి.. పదోన్నతులు పొంది.. విశ్వవిద్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలను స్వీకరించడం నాకు ఎంతో ఆనందం కలిగించింది అన్నారు. ఆశయ సాధనలో ఎన్నో అవరోధాలు వచ్చిన.. పట్టు వీడని దృఢ సంకల్పంతోనూ.. నిరంతర సాధన, క్రమశిక్షణ, పుస్తకాలపై నిరంతర కృషి ఫలితంతోనే నేను విజయాలను అందిపుచ్చుకోగలిగాను అన్నారు.గమ్యాన్ని ఎంచుకోవాలి వెనుతిరగకూడదు..పోటీ పరీక్షలలో ఎంచుకున్న గమ్యం వైపే అడుగులు వేయాలి కానీ వెనుతిరిగిపోకూడదని.. పరీక్షలో విఫలమైతే మరింతగా శ్రమించాలి, అవకాశాలుగా మలుచుకోవాలి,సమయాన్ని ప్రణాళిక కార్యచరణతో రూపకల్పన చేసుకుంటూ.. నిత్యం అన్వేషణతో విజయ గమ్యాలను చేరుకోవాలని సూచించారు.


