ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వం మహిళా సంక్షేమానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తోందని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు. ఇటీవల రేషన్ డీలర్ల రాష్ట్ర అసోసియేషన్ కమిటీలోకి స్థానం దక్కిన రాజాం మండలం అంతకాపల్లి డిపోకు చెందిన డీలర్ల సమాఖ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వాకుముల్ల జోత్స్నదేవిని, అలానే రాజాం పట్టణం ఠాణావీధి డిపో డీలర్ డీలర్ల సమాఖ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీ లలితకుమారిని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చం అందజేసి అభినందించారు. రేషన్ డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ సజావుగా నిర్వహించాలని ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చూడాలని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్
పేర్కొన్నారు. ప్రతి రేషన్ డీలర్ నిబంధనలు పాటించి పంపిణీ సజావుగా జరగాలని సమస్యలు రాకూడదన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


