Homeజిల్లాలువిజయనగరంరాజాం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యం: టంకాల ప్రియాంక

రాజాం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యం: టంకాల ప్రియాంక

- Advertisement -

విశాలాంధ్ర – విజయనగరం జిల్లా,రాజాం: తమ కుటుంబం 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోందని, పార్టీ ఆదేశిస్తే రాజాం మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టంకాల ప్రియాంక తెలిపారు. తన మామయ్య టంకాల వెంకటేశం గతంలో రాజాం టీడీపీ అధ్యక్షుడిగా సేవలందించారని, తన భర్త దిలీప్ కుమార్ కూడా పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశయాలకు కట్టుబడి ఉంటామని, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సూచనలను గౌరవిస్తామని చెప్పారు. పార్టీ అధిష్ఠానం అనుమతితో పోటీ చేసి రాజాం మున్సిపాలిటీలో టీడీపీ విజయానికి కృషి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు