Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅధికార పూర్వకంగా సర్పంచ్, ఉప సర్పంచ్ల జాబితాను విడుదల .. ఎంపీడీవో వెంకటేష్

అధికార పూర్వకంగా సర్పంచ్, ఉప సర్పంచ్ల జాబితాను విడుదల .. ఎంపీడీవో వెంకటేష్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలలో నిర్వహించిన ఎన్నికలలో ఎన్నికల సంఘం, కలెక్టర్ ఆదేశాల మేరకు సజావుగా నిర్వహించడం జరిగింది. ఈ సర్పంచుల, ఉప సర్పంచుల జాబితా విడుదల చేయడానికి శుక్రవారం తెల్లవారుజామున వరకు ఉద్యోగస్తులు తమ విధులను నిర్వర్తించారు. తదుపరి ఎంపీడీవో వెంకటేష్ సర్పంచు, ఉప సర్పంచుల జాబితాను అధికార పూర్వకంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మారం మండల పరిధిలో 20 గ్రామ పంచాయతీలలో జాబితాను విడుదల చేయడం జరిగిందని, ఇందులో పోతుకుంట గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా తలారి వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ గా జి. ఈశ్వరమ్మ, మల్లా కాలువ లో సర్పంచుగా కందేరి ఆదినారాయణ, ఉప సర్పంచ్ గా ఇంక ను ప్రకటించలేదు, కునుతురులో సర్పంచుగా అనిత, ఉప సర్పంచ్ గా ప్రకటించలేదు, సుబ్బారావు పేటలో టీ. చిన్న గంగప్ప, ఉప సర్పంచ్ గా తలారి హేమ తేజ, తుమ్మల గ్రామపంచాయతీలో సర్పంచ్గా ప్యాదిండి వెంకట రమణమ్మ, ఉప సర్పంచ్గాసి.వినోద్ కుమార్ రెడ్డి, మల్కాపురంలో సర్పంచ్ గా మిడతల శివానంద, ఉప సర్పంచ్ గా జి.ఆనంద్, నేలకోటలో సర్పంచ్ గా బి లక్ష్మీదేవి, ఉప సర్పంచ్ గా యు. విజయలక్ష్మి., చికిచెర్ల లో సర్పంచ్ గా పెద్దిరెడ్డి గారి హంస వేణి, ఉప సర్పంచ్ గా షేక్ రామకృష్ణ, ఉప్పులేసనపల్లిలో సర్పంచుగా ఎన్ మధురవాణి, ఉప సర్పంచ్ గా ఎస్ కోమల, చింతలపల్లి లో సర్పంచ్ గా పి సౌభాగ్య, ఉప సర్పంచ్ గా జి నాగేంద్రప్రసాద్, రేగాటిపల్లి లో సర్పంచ్ గా చిన్న వారాధమ్మ, ఉప సర్పంచ్ గా వల్లి వెళ్లి జ్యోతి, పోతుల నాగేపల్లి లో సర్పంచ్ గా డి బాబయ్య, ఉప సర్పంచ్ గా జి. శ్యామలమ్మ, ఏలుకుంట్లలో సర్పంచ్ గా ఏ వెంకటరమణ, ఉప సర్పంచ్ గా టి శ్యామలమ్మ, రాహుల్ చెరువులో బిల్లే పెద్దయ్య, ఉప సర్పంచ్ గా ఎన్నిక లేదు, గొట్లూరు లో ఎన్ మారుతి కుమార్, ఉప సర్పంచ్ గా ఎన్నిక లేదు, సీసీ కొత్తకోటలో సర్పంచ్ గా జ్యోతి రాజేశ్వరి, ఉప సర్పంచ్ గా ధలవాయి గౌతమి, దర్శనమల లో సర్పంచుగా ముక్కర ఓబులేష్, ఉప సర్పంచ్ గా ఎం నారాయణస్వామి, నేలకోట తండాలో సర్పంచుగా శాంతి భాయ్, ఉప సర్పంచ్ గా రమేష్ నాయక్, ధర్మపురిలో సర్పంచ్ గా జి. విజయ్ కుమార్, ఉప సర్పంచ్ గా దేవరకొండ విష్ణు, వెంకట తిమ్మాపురం లో సర్పంచ్ గా సాకే బాలమ్మ, ఉప సర్పంచ్ గా డి సుగుణ కలరు అని తెలిపారు. వీరందరికీ డిక్లరేషన్ ఫారం కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి ఎన్నికైన అభ్యర్థులకు ఎంపీడీవో తో పాటు ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు