Homeజిల్లాలుఅనంతపురంఉమ్మడి అనంతపురం బాస్కెట్‌బాల్ జట్లకు ధర్మవరం బాలబాలికలు ఎంపిక

ఉమ్మడి అనంతపురం బాస్కెట్‌బాల్ జట్లకు ధర్మవరం బాలబాలికలు ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;రాష్ట్ర స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం పట్టణంలో నవంబరు 26 తేదీ నుండి 28 తేదీ వరకు జరిగే 12వ సీనియర్ ఇంటర్ డిస్టిక్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్‌బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన బాలికలు నిక్యశ్రీ, .యశస్విని, అలేఖ్య, వైష్ణవి బాలుర విభాగంలో వీర సంజయ్ కుమార్ రెడ్డి, లక్ష్మీ నరసింహ పట్టణానికి చెందిన ఆరుగురు (06)బాస్కెట్‌బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ, శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 22 వ తేదీ అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియం నందు జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు.. వీరి ఎంపిక పట్ల , ధర్మాంబా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు