Homeజిల్లాలుఅనంతపురంపంచాయతీ ఎన్నికల విధులకు ఉద్యోగులకు దిశానిర్దేశం

పంచాయతీ ఎన్నికల విధులకు ఉద్యోగులకు దిశానిర్దేశం

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల: మండల వ్యాప్తంగా ఆదివారం జరగనున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ఉద్యోగులకు ఉన్నత బాలికల పాఠశాలలో మండల అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో సిబ్బంది పాటించాల్సిన నిబంధనలు, పోలింగ్ ప్రక్రియ, బ్యాలెట్ నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా సూచనలు అందించారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఉద్యోగి సమన్వయంతో పనిచేయాలని మండల అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు