Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా స్థాయి పోటీలలో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థిని ప్రతిభ

జిల్లా స్థాయి పోటీలలో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థిని ప్రతిభ

- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;;జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగిన క్విజ్ పోటీలలో ధర్మవరం రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థిని జి. రిషిత, తన ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయిలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుని, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్, కళాశాల ఇంచార్జి రమేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , మంగళవారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చేతులమీదుగా జ్ఞాపిక, సర్టిఫికెట్ అందుకోవడం జరిగిందని వారు తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు కేవలం చదువులో మాత్రమే కాకుండా పలు రంగాలలో రాణించటం సంతోషంగా ఉందని, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభను చాటి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలి అని వారు ఆకాంక్షించారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు