ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రపంచంలోనే ఊబకాయ సమస్య అధికంగా ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ సంకారపు నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ ఊపకాయా నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేస్తూ ఊబ క్రమము శరీరంలోని ఎన్నో జబ్బులకు కారణభూత మోతున్నాయని తెలిపారు. వ్యక్తి యొక్క వయసును బట్టి ,పురుష ,లింగ విభేదము వలన, ఎత్తును బట్టి శాస్త్రీయంగా ఉండవలసిన బరువు నిర్దేశిత మౌతుందని తెలిపారు. ఆ నిర్దేశిత ప్రకారం కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయంగా పరిగణించవచ్చునని తెలిపారు. ఈ వ్యాధికి కారణం ఆహారములో పిండి పదార్థములు, కొవ్వులు ఎక్కువగా, తదుపరి ప్రోటీన్లు తక్కువగా తీసుకోవడం వలన శారీరక శ్రమ లేకపోవడం అనేది కారణాలని తెలిపారు. ఈ ఊపకాయం వలన చక్కెరవాది, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షపాతము మొదలగు జబ్బులు వస్తాయని తెలిపారు. కావున ప్రజలు ఆహార నియమాలను పాటిస్తూ తగిన శారీరక శ్రమను కలిగిస్తే ఊబ కాయమును అదుపులో ఉంచుకోవచ్చు అని తెలిపారు.
ప్రపంచంలో ఊబకాయ సమస్య అధికంగా ఉంది…
- Advertisement -
RELATED ARTICLES


