వన్ టౌన్ సీఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం; రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, డి.ఎస్.పి జగన్నాథ్ రాజు పర్యవేక్షణలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. గతంలో వివిధ నేరాల్లో పాల్గొన్న వ్యక్తులు బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరిగి నేరాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సిఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
సాకే నరసింహులు (23), హనుమంతు కుమారుడు, ఎంజీ కాలనీకి చెందిన వ్యక్తి. ఇతను 2025లో పోక్సో కేసులో నిందితుడిగా ఉండటంతో బైండ్ ఓవర్ చేశారు. అనంతరం 2026లో జరిగిన దొంగతనం కేసులో (2026) ఇతని ప్రమేయానికి సంబంధించిన వివరాల ఆధారంగా బైండ్ ఓవర్ నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకొని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీనిపై మేజిస్ట్రేట్ రూ.50,000 జరిమానా విధించారు అని తెలిపారు.
బనియన్ నరేష్ (33), దివంగత రామకృష్ణ కుమారుడు, ధర్మవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను క్రైమ్ నంబర్ 204/2024 కేసులో నిందితుడిగా ఉండటంతో బైండ్ ఓవర్ చేశారు. అయినప్పటికీ, 2025లో మరో హెచ్ యు ఆర్ టి కొట్లాట కేసులో కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో బైండ్ ఓవర్ నిబంధనల ఉల్లంఘన కింద మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, రూ.50,000 జరిమానా విధించి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు అని తెలిపారు.
ధర్మవరం పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, గతంలో నేరాలకు పాల్పడిన వారు, బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతర నిఘా ఉంచినట్లు సిఐ తెలిపారు. బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా నేరాలకు పాల్పడినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా, ఎన్నికలతో సహా ఇతర సందర్భాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టం అనుమతించే మేరకు రూ.5 లక్షల వరకు జరిమానా విధించేలా సంబంధిత అధికారుల ముందు చర్యలు తీసుకుంటామని,మూడు లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులపై వారి నేర చరిత్ర, ప్రస్తుత ప్రవర్తన, చట్టపరమైన నిబంధనల ఆధారంగా ఎక్స్టర్న్మెంట్ (జిల్లా బహిష్కరణ) లేదా పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.
బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు…
- Advertisement -
RELATED ARTICLES


