స్థానిక ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు సీఐ జయ నాయక్ హెచ్చరిక
విశాలాంధ్ర ధర్మవరం; రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సీఐ జయ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడటం,ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.


