Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి..

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి..

- Advertisement -

ఐఎన్టియుసి కాంగ్రెస్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ కాంగ్రెస్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు తుంపర్తి పరమేష్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈసందర్బంగా తుంపర్తి పరమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓట్ చోర్ కీ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అలుపెరుగనిపోరాటం చేస్తున్నారని వారికి అండగా దేశ ప్రజల మద్దత్తు ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరు చైతన్యమై బీజేపీనీ గద్దెదింపాలని అలాగే జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, వివిధ విద్యార్థి సంఘముల నాయకులు ఎస్ఎఫ్ఐ నాగార్జున, పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర సుకృత్, ఏఐఎస్బి స్టేట్ కౌన్సిల్, బి ఎస్ పి వినయ్, జిల్లా అధ్యక్షులు, రాంప్రసాద్, బి.ఎస్.పిజిల్లా ప్రధాన కార్యదర్శి,సాకే కుళ్లాయప్ప , ఎస్ సి జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ నిసార్ అహమ్మద్, పీసీసీ డెలిగేట్,కేకేసీ జిల్లా అధ్యక్షులు కాటమయ్య, అనిల్ యూత్ కాంగ్రెస్, కుళ్లాయప్ప దళిత వేదిక జిల్లా అధ్యక్షులు నరసింహులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద రాజు ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజ్ కుమార్ శీన, పెద్దన్న, మసూద్, బాబ్జాన్, కాజా ఇమ్రాన్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు