లక్ష రూపాయల నగదు, లక్షల విలువైన స్పేర్ పార్ట్స్ అపహరణ
విశాలాంధ్ర – కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అనంతపురం ప్రధాన రహదారిలో ఉన్న హీరో ద్విచక్ర వాహనాల షోరూంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీకి పాల్పడ్డారు. షోరూం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.లక్ష నగదుతో పాటు లక్షల రూపాయల విలువైన విడిభాగాలను అపహరించారు.వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి షోరూం పనులు ముగించుకున్న నిర్వాహకులు షోరూంకు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లారు. శనివారం ఉదయం షోరూం వద్దకు చేరుకున్న వారు తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపల పరిశీలించగా నగదు, స్పేర్ పార్ట్స్ చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, చోరీపై విచారణ చేపట్టాల్సి ఉంది. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న షోరూంలోనే దొంగతనం జరగడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణంలో రాత్రి వేళ పోలీసుల గస్తీని మరింత పటిష్టం చేయాలని వ్యాపారులు కోరుతున్నారు.
కళ్యాణదుర్గంలో దొంగల బీభత్సం.. హీరో షోరూంలో భారీ చోరీ..
- Advertisement -


