Friday, May 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం.. మదీనా మజీద్ కమిటీ

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం.. మదీనా మజీద్ కమిటీ

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని 34 వార్డు రాజేంద్రనగర్ లో నివాసముంటున్న మంగళ లక్ష్మీనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సమాచారం అందుకున్న మదీనా మజీద్ కమిటీ, మదీనా వెల్ఫేర్ కమిటీ వారు నాగూరు హుస్సేన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ఈ కుటుంబానికి తమ వంతుగా సహాయాన్ని ఇవ్వడం మాకెంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. కుటుంబ సభ్యులు మదీనా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదీనా మజీద్ ముత్తు వల్లి నాగూర్ హుస్సేన్, అల్తాఫ్, అయుక్కన్, టింకర్ కాజా, సలీం ఖాన్, అబ్దుల్ అజిత్, ఇలా హిచాంద్ బాషా, అమీర్ ఖాన్, ఇనాయత్తుల్ల, సేక్షావలి, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు