Homeజిల్లాలుతూర్పు గోదావరిచైతన్య నగర్ లో అగ్నిప్రమాదం

చైతన్య నగర్ లో అగ్నిప్రమాదం

- Advertisement -

సుమారు 50 లక్షల వెదురు కర్ర పంట పంట నష్టం

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, మాధవ రాయుడుపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని, చైతన్య నగర్ గ్రామంలో జూన్ 8వ తేదీ సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో, సుమారు 50 లక్షల రూపాయలు విలువైన గోల్డెన్ బేంబు (వెదురు కర్ర) పంట అగ్నికి ఆహుతి అయ్యింది. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన ఈశ్వరా ఫాం అండ్ నర్సరీ అధినేత తాడాల విష్ణు చక్రవర్తి భార్య రాజరాజేశ్వరి కి చెందిన 4.99 ఎకరాల నర్సరీ భూమిలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు మాధవ రాయుడుపాలెం వీఆర్వో వెంకట్రావు కడియం ఎమ్మార్వో కార్యాలయంలోసమాచారం అందించారు. అగ్ని ప్రమాదాన్ని గమనించిన చైతన్య నగర్ యువకులు రాజమండ్రి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో పాటు, మంటలు అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. రాజమండ్రి నుండి వచ్చిన ఫైర్ ఇంజన్, స్థానిక పేపర్ మిల్లు కి చెందిన ఫైరింజన్లు సుమారు ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదని, అలాగే ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏమీ తెలియరాలేదని స్థానికులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు