హెచ్‌పీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్లోకి నీరు
పాతాళగంగలో కొట్టుకుపోయిన 3 వేల సిలిండర్లు
ముంబై: ముంబై మహా నగరం వరదలతో అతలాకుతలమవుతోంది. గత వారం రోజులుగా విపరీతంగా కురుస్తున్న వర్షాలకు నగరంలో చాలా ప్రాంతాలు జలమమయ్యాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను అతిభద్రంగా దాచుకుంటున్నాం. ఇప్పుడు ముంబైకి వచ్చిన వరద ముప్పుతో మహారాష్ట్రలో 3 వేల గ్యాస్ సిలిండర్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రాయగఢ్ జిల్లాలోని హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయమైంది. ఆ వరద ప్రవాహ తీవ్రతకు 3వేల వరకు సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. వాటిలో కొన్ని ఖాళీవి కూడా ఉన్నాయి. దీనితో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఎవరూ తీసుకెళ్లవద్దని రాయగఢ్ జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు. ‘నదిలోకి కొట్టుకొచ్చిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో, సురక్షితమైన స్థితితో ఉన్నాయో లేదో చెప్పలేం. వాటిని తీసుకెళ్లడం ప్రమాదానికి దారితీయొచ్చు’ అని హెచ్చరించారు. అవి కనిపించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం వాటిని గుర్తించి, స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సబరÒన్ ప్రాంతంలోని…కుర్లా, అంధేరి, సాకినాకా, గోరేగావ్, శాంతాక్రాజ్, సెంట్రల్హార్బర్ లైన్స్‌లో...విఖ్రోలి, ఘట్కోపర్, మాతుంగా, దక్షిణ ముంబైలోని...గ్రాంట్ రోడ్డు, మెరైన్ డ్రైవ్ ప్రాంతాలు, బాంద్రాకుర్లా వాణిజ్య సముదాయం పూర్తిగా జలమయమయినాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఎల్‌నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు చెప్పిన మాట…
ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్నప్పటికీ ముంబైలో ఈ నెల తొలి వారంలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గ్లోబల్ వార్మింగ్, అరేబియా సముద్రం`బంగాళాఖాతం నుంచి పెరిగిన తేమ, పశ్చిమ కనుమల ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వర్షాల ప్రభావం పూర్తిగా మారిపోయిందని వారు తెలిపారు. ఇప్పుడు ఇదివరకిటి మాదిరి చాలా రోజులు పాటు వర్షాలు కురవకుండా, ఒక్కసారిగా ఎక్కువ స్థాయిలో అత్యంత తీవ్రతగా కురుస్తున్నాయని వివరించారు.
ముంబైలో ముంచెత్తిన వరద
- Advertisement -


