Homeజాతీయం‘యూజీసీ నెట్’ పేపర్ లీక్

‘యూజీసీ నెట్’ పేపర్ లీక్

- Advertisement -


రాహుల్ గాంధీ ఆరోపణ
న్యూదిల్లీ:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్ పేపర్ లేకేజీ వివాదం ముగియకముందే మరో ప్రశ్నపత్రం లీకైన ఘటన తెరపైకి వచ్చింది. పరీక్షకు ముందే ‘యూజీసీ నెట్ సోషియాలజీ’ ప్రశ్న పత్రం లీకైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వెంటనే స్పందిస్తూ ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. యూజీసీ నెట్ పరీక్షకు ముందు 100 పేజీల పీడీఎఫ్ ఒకటి బయటకు వచ్చిందని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అందులో సుమారు 90 ప్రశ్నల వరకు ఒరిజినల్ సోషియాలజీ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలాయన్నారు. ఈ ప్రశ్నపత్రం బీహార్, ఉత్తర్ప్రదేశ్, హర్యానా, దిల్లీ, రాజస్థాన్‌లో సుమారు రూ.2.25 లక్షలకు అమ్ముడుపోయిందని ఆయన ఆరోపించారు. ఇదే నెట్‌వర్క్ సీఎస్‌ఐఆర్-నెట్, హెచ్‌టీఈటీ, ఏడీఏ వంటి పరీక్షల ప్రశ్నపత్రాలను కూడా సరఫరా చేస్తోందనీ రాహుల్ పేర్కొన్నారు. జూన్ 30న జరిగిన ఈ ప్రశ్నపత్రం పరీక్షకు ముందే లీకైందని వచ్చిన మీడియా కథనాలనూ ప్రస్తావించారు రాహుల్. కాగా…రోహ్ తక్ (హర్యానా)లో ఇద్దరు విద్యార్థి నాయకులు ఓ వీడియోనూ పోస్ట్ చేస్తూ…పరీక్షకు ముందే బోధించిన 2 ప్రశ్నపత్రాల సెట్లలో ఒకటి అసలు దానితో సరిపోలుతోందని పేర్కొన్నారు. మరోపక్క ఈ పరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులు ప్రశ్నపత్రంలో అనేక అక్షర, వ్యాకరణ దోషాలు సహా స్పష్టతలేని ప్రశ్నలున్నాయనే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కొందరు అనేక ఉదాహరణలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముఖ్యమైన సామాజిక శాస్త్రవేత్తల పేర్లను తప్పగా ముద్రించడం సహా సంబంధంలేని ప్రశ్నలను అడిగారని వారు పేర్కొన్నారు. మొత్తం 150 ప్రశ్నల్లో కనీసం 67 ప్రశ్నలు గతంలో నిర్వహించిన 2024 పరీక్షలో వచ్చిన వాటితో పోలి ఉన్నాయని, కనీసం బహుళైచ్ఛిక ప్రశ్నల సమాధానాల క్రమమూ మారలేదని ఆరోపించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు