Homeజిల్లాలుశ్రీ సత్యసాయిషిరిడి సాయిబాబా దేవాలయములో అన్నదానం

షిరిడి సాయిబాబా దేవాలయములో అన్నదానం

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని శిరిడి సాయిబాబా దేవాలయంలో పట్టణ వాస్తవ్యులు బలిజ సంఘం నాయకులు కీర్తిశేషులు మిరియాల హనుమంతు వారి 16వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అనాధ పేదలకు వృద్ధులకు ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో పేద ప్రజలకు వివిధ సేవలు చేయాలని తెలిపారు. అనంతరం షిరిడి సాయిబాబా సేవా సమితి వారు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిరియాల అంజి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు