Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ..

ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ..

- Advertisement -

వైయస్సార్ సిపి నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు 37వ వార్డు నందు రాష్ట్ర మున్సిపల్ ప్రధాన కార్యదర్శి చెందమూరి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, సంతకాల సేకరణ తర్వాత గవర్నర్కు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు