విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల మున్సిపల్ సెంట్రల్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు దాతలు నామాల శ్రీనివాసులు, అరుణ్ కుమార్ చేతుల మీదుగా విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ పాఠశాల హెడ్మాస్టర్ హేమంత్ బాబు ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్యను 45 వరకు పెంచడం అభినందనీయ తగ్గ విషయమని తెలిపారు. గతంలో కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, నేడు సెలవుల్లో తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలన్న ప్రచారం చేయగా, ఫలితంగా 45 మంది విద్యార్థులు చేరడం జరిగిందని తెలిపారు. ఇటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషి అభినందనీయమని, ప్రభుత్వం కూడా ఈ పాఠశాల పట్ల మరింత చొరువ చూపాలని తెలిపారు. మామూలుగా ఉపాధ్యాయులు సంఖ్య తక్కువ ఉన్నచోట, వదిలి బదిలీల లో భాగంగా వేరే పాఠశాలకు వెళ్తారని, అలాంటిది హెడ్మాస్టర్ హేమంత్ బాబు అకుంఠితదీక్షతో, పట్టుదలతో, పట్టు వదలని విక్రమార్కుల్లా తన పాఠశాలను అత్యధిక సంఖ్యలో విద్యార్థులను చేర్చడం, అతని శ్రమకు ఫలితమని తెలిపారు. మున్ముందు మా సహాయ సహకారాలు మీ పాఠశాలకు ఉంటాయని వారు స్పష్టం చేశారు. తదుపరి మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ మాట్లాడుతూ హెడ్మాస్టర్ హేమంత్ బాబు కృషి, ప్రభుత్వ పాఠశాలల పట్ల తపన అభినందించ తగ్గ విషయమని వారు కొనియాడారు. అందుకే నాగమణి అనే మరో టీచర్ని పాఠశాలకు వేయడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


