విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కుల వృత్తుల వారికి 3.0 పథకం ద్వారా అధునాతన పరికరాలను పరిముట్రాలను అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన సహకార ఆర్థిక సంస్థ కార్యాలయం (బీసీ కార్పొరేషన్ స్టేట్ ఆఫీస్ )లో జి.ఎం.భీమ శంకర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ విషయమై చేనేత కార్మిక సంఘాల నాయకులు ,ఈ చేనేత రంగంలో పనిచేసే అనుభవజ్ఞులైన కార్మికులు తోను ,రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల ఫెడరేషన్ల నాయకులు ,బిసి కార్పొరేషన్ ఉద్యోగులతో హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి ఏపీ ప్రగతిశీల చేనేత కార్మిక సంఘం నాయకులు పోలా లక్ష్మీనారాయణ ,చిప్పల మార్కండేయులు పాల్గొని చేనేతలకు పవర్లూమ్స్ నుండి పోటీని తట్టుకొని నిలబడడానికి అధునాతనమైన ఎలక్ట్రానిక్ చిప్ జా కార్డులను , జాకార్డ్ లిఫ్టింగ్ మోటార్లను,అని మిషన్ యంత్రాలను ,బోట్లు చుట్టే యంత్రాలను, పట్టు వైడింగ్ మిషన్లను , ఇంకా తదితర అధునాతనమైన పరికరాలను పనిముట్లను అందించాలని సమావేశంలో బీసీ కార్పొరేషన్ జిఎం గారికి వివరించడం జరిగింది . ఈ సమావేశంలో ఉమ్మడి అనంతపురం జిల్లా బీసీ కార్పొరేషన్ ఉద్యోగి వెంకటేష్ గారు పాల్గొన్నారు .
చేనేత కుల వృత్తుల వారికి అధునాతన పరికరాలను అందించండి
- Advertisement -
RELATED ARTICLES


