Homeఆంధ్రప్రదేశ్లోక కళ్యాణం కోసమే

లోక కళ్యాణం కోసమే

- Advertisement -

లోక కళ్యాణం కోసమే మహాకోటి బిల్వర్చన… 

స్పీకర్ అయ్యన్నపాత్రుడు..

శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ దంపతులు…

మహా క్రతువులో పాల్గొన్న ఎమ్మెల్యేలు నల్లమిల్లి, గోరంట్ల,వేగుళ్ళ, ఎమ్మెల్సీ వీర్రాజు.

విశాలాంధ్ర –  అనపర్తి : గడచిన ఆరేళ్ల క్రితం ఏర్పడిన ప్రభుత్వం వల్ల రాష్ట్రం లోని ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని ఆ సమయంలో ప్రజాజీవనం కుదుటపడాలంటే మహాకూటి బిల్వార్చన చేయటం అవసరమని వేద పండితులు, శివాచార్య ఎలమంచిలి కృష్ణమూర్తి సూచించడంతో తాను లోక కళ్యాణార్థం కోసమే అనపర్తి మండలం పెడపర్తి పార్వతి రామలింగేశ్వర ఆలయంలో ఈ మహాక్రతువును మండలం పాటు (41 రోజులు) నిర్వహించటం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శివాలయంలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ జిల్లాకి ఒక వేద పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. మనం ఉండే గ్రామం మనం ఉండే రాష్ట్రం మనం ఉండే దేశం సుభిక్షంగా ఉండాలంటే సృష్టి స్థితి లయ కారుకులకు నిత్యం పూజలు చేయాలని చెప్పారు. అంతకుముందు 41 రోజులుగా సాగుతున్న మహాక్రతువుకు సంబంధించి జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ రుద్రయాగ – చండీయాగ – నవగ్రహయాగ మహాకోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన – పూర్ణహుతి హోమం మరియు స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములలో పాల్గొన్ని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయ్యన్నపాత్రుడు పద్మావతి దంపతుల సారధ్యంలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గోదావరి ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్  శివచార్యలు బ్రహ్మశ్రీ యలమంచిలి కృష్ణమూర్తికి కనకాభిషేకంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ,మండల కూటమి నాయకులు,పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు,గ్రామస్థులు,భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు