Wednesday, February 18, 2026
Homeతెలంగాణరేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తుగ్లక్‌ పనులు…

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తుగ్లక్‌ పనులు…

- Advertisement -


జంట నగరాల అస్తిత్వం దెబ్బతీస్తే ఉపేక్షించం: కేటీఆర్‌

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తుగ్లక్‌ పనులు చేస్తోంది’’ అని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్‌ఎస్‌ ర్యాలీకి సిద్ధమైంది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ శాంతి ర్యాలీకి నేతలు బయలుదేరారు. అయితే.. తమను పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్‌ అన్నారు.‘‘జంట నగరాల అస్తిత్వం దెబ్బతీస్తే ఉపేక్షించం. ప్రజలకు నిరసన హక్కు లేకుండా చేశారు. ప్రజల దీవెనలతో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది.కోర్టు నుంచి అనుమతి తీసుకుని మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని ఆ పార్టీ నేత తలసాని అన్నారు. తాము నిర్వహిస్తున్నది శాంతియుతమైన ర్యాలీ అని.. అందరినీ ఆహ్వానించినట్లు తెలిపారు. ర్యాలీని అడ్డుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని మండిపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు