భారీ ర్యాలీ నిర్వహణ
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ధర్మవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ ఎస్బిఐ కాలనీ లోని కేతిరెడ్డి ఇంటి నుండి కాయగూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ శాఖ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ధ్వనులతో కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ ఏ డి ఈ లక్ష్మీనరసింహారెడ్డి కు వినతి పత్రాన్ని అందజేస్తూ సామాన్య ప్రజల పైన భారం పడకుండా చేస్తూ న్యాయం చేయాలని వారు కోరడం జరిగింది. అనంతరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోరు బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన ర్యాలీ జరిగిందని, ఇందులో భాగంగా ధర్మారంలో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించడం జరిగిందని తెలిపారు.ట్రూ ట్రాప్ చార్జీల పేరుతో పేద ప్రజలపై భారాన్ని మోపడం సరైన పద్ధతి కాదు అని తెలిపారు. చార్జీల పెంపుపై తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కుంగలో తొక్కి, హామీల విషయం మరవడం దారుణమని వారు దుయ్యబట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు తప్పుడు హామీలు ఇచ్చి అధికారం చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యుత్ చార్జీల పేరిట ప్రజలపై 15000 కోట్ల రూపాయలు భారం వేయడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యుత్ అవసరాల నిమిత్తం కొనుగోలును అధిక ధరకు కూడా కొనుగోలు చేయడం సమంజసమేనా??? అని ప్రశ్నించారు. ప్రజలను దగా చేయడం మోసపుచ్చడం ఎన్డీఏ ప్రభుత్వానికి అలవాటైందని తెలిపారు. ఇకనైనా ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనదని వారు పిలుపునిచ్చారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు సల్ఫీ ప్రజలకు న్యాయం చేకూర్చుతామని తెలిపారు. రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టడంలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరని తెలిపారు. పెంచిన విద్యుత్ చార్జీల భారం కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు, చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, తాడిమర్రి ఎంపీపీ పార్టీలు భువనేశ్వర్ రెడ్డి, గుర్రపు శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ రావులచెరువు ప్రతాపరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాల్రెడ్డి ,మాజీ వైస్ చైర్మన్ మాసపల్లి సాయికుమార్, చందమూరి నారాయణరెడ్డి ,పెనుజూరు నాగరాజు, కౌన్సిలర్లు మేడాపురం వెంకటేశు, గోరకాటి పురుషోత్తం రెడ్డి, అత్తర్ జిలాన్, కే తా లోకేష్ ,బడన్నపల్లి కేశవరెడ్డి ,వార్డు ఇన్చార్జులు కత్తి పెద్దన్న, చెలిమి పెద్దన్న కేశగాల్ల కృష్ణ, సుభాన్ భాష, నియోజకవర్గ కన్వీనర్లు, విద్యార్థి సంఘం నాయకులు పురుషోత్తం, రాజశేఖర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి…
RELATED ARTICLES