– ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బికే ముత్యాలప్ప
విశాలాంధ్ర ధర్మవరం: ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉచిత సేవలను ప్రారంభించడం ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బి కే ముత్యాలప్ప తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం జోన్ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 2025 – 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఉచితంగా చేసి ఇవ్వబడునని ఉపాధ్యాయుల పూర్తిగా ఉచితంగా సంఘాలతో నిమిత్తం లేకుండా అందించబడునని తెలిపారు. ధర్మవరం పట్టణంలో, ఎన్జీవో కార్యాలయంలోని పెన్షనర్స్ భవనం నందు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఈ సదుపాయం నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు,స్టేట్ కౌన్సిలర్ వాసు కుమార్,జిల్లా ప్రత్యేక ఆహ్వానీతులు సి. శంకర్ నారాయణ, హేమంత్ కుమార్,ధర్మవరం మండల ప్రధాన కార్యదర్శ ఈశ్వరయ్య,అధ్యక్షులు శివానంద, గౌరవ అధ్యక్షులు బయన్న,జిల్లా కార్యవర్గ సభ్యులు బాలయ్య, పట్టణ అధ్యక్షులు గోపి, అంజి నాయక్, సి కె పల్లి మండల అధ్యక్షులు రామకృష్ణ, రామగిరి మండలం అధ్యక్షులు కె రామాంజినేయులు జిల్లా టెక్నికల్ కమిటీ సభ్యులు జగదీశ్, అన్నం చంద్ర. పెద్ద ఓబిలేసు, సీనియర్ నాయకులు నాగప్ప, సంజీవప్ప, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు ఉచితంగా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సర్వీసులు
- Advertisement -
RELATED ARTICLES


