Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచిన్నపిల్లలకు ఉచిత వైద్య శిబిరం

చిన్నపిల్లలకు ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

-స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ .బషీర్, డాక్టర్ సోనియా

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్ లో ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చిన్న పిల్లల ఉచిత వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్.బషీర్, డాక్టర్. సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పిల్లలకు జలుబు,అన్ని రకముల జ్వరాలు దగ్గు, పచ్చకామెర్లు, బేదులు ప్రత్యేక వైద్య పరీక్షలు అందించి ,ఉచితముగా మందులను పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన చిన్న పిల్లలకు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలను అందిస్తామని తెలిపారు. పురిటి పిల్లల కోసం ప్రత్యేక వైద్య పరికరాలు కూడా కలవని తెలిపారు. కావున ఈ శిబిరాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు