Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రైవేట్ మెడికల్ లేబరేటరీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ప్రైవేట్ మెడికల్ లేబరేటరీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

- Advertisement -

డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చెన్నారెడ్డి


విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం డివిజన్ లోని డిప్యూటీ ఆఫీసు నందు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ విజయ్ ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్స్ కు రిజిస్ట్రేషన్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెప్పడం జరిగినది . అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ల్యాబ్ కు పర్మిషన్ అనేది తీసుకుంటే రిజిస్ట్రేషన్ తో మీకు గుర్తింపు వస్తుందని తెలిపారు. దానివలన మీకు మీ సేవలకు ఇబ్బంది ఉండదని తెలియజేశారు. వెరిఫికేషన్ కు వచ్చిన హెల్త్ ఎడ్యుకేటర్ విజయ్ మాట్లాడుతూ ప్రతి ల్యాబ్ కు దానికి సంబంధించిన కోర్సు చేసిన వ్యక్తి సేవలు అందించాలని, దాని వలన నాణ్యమైన సేవలు అందుతాయి అన్నారు..ప్రస్తుత పరిస్థితులలో డిఎంహెచ్ఓ ఆదేశాను సారము ధర్మవరంలో ప్రవేట్ హాస్పిటల్స్ , ప్రైవేట్ ల్యాబ్ లను తనిఖీ చేసి వారికి పర్మిషన్ ఉన్నదా? రిజిస్ట్రేషన్ ఉన్నదా? అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుందన్నారు.ముఖ్యంగా ల్యాబ్ నిర్వహిస్తున్న వారు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని స్పష్టం చేశారు. అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని, ,ఫైర్ స్టేషన్ నుంచి అనుమతి ఉండాలి అని తెలిపారు. బయో మెడికల్ వేస్ట్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి తెలిపారు. ఇవి వచ్చిన తర్వాతనే వారు ల్యాబ్ నిర్వహించుకోవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఏరియాలో పనిచేయుచున్న మలేరియా అసిస్టెంట్లు, అలాగే కమ్యూనిటీ ఆర్గనైజర్స్ ,ల్యాబ్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు