Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి వార్షికోత్సవ వేడుకలు

- Advertisement -



విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని కెపిటి వీధిలో గల వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగి 24 వసంతాలు గడిచిన శుభ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఆర్యవైశ్యులు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ, వాసవి మహిళా మండలి, యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. తదుపరి అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. ప్రతి ఒక్కరి చేత పాలాభిషేకమును చేయించారు. వాసవి పారాయణం లలిత పారాయణం, అమ్మవారికి సంధ్యా సమయంలో సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం, దీప కాంతుల వెలుగులతో కడు రమణీయంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వందల సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు