Homeఆంధ్రప్రదేశ్నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

- Advertisement -

నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్..కండక్టర్ కు నీట్ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది

జూన్ 21న దేశవ్యాప్తంగా జరగబోయే ‘నీట్్ణ రీ-ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్ష రాస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎగ్జామ్ సెంటర్ల దూరభారం, ప్రయాణ ఖర్చులతో టెన్షన్ పడుతున్న విద్యార్థులకు ఊరటనిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

రవాణా ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ స్పెషల్ ప్లాన్
టికెట్ ఫ్రీ.. హాల్ టికెట్ ఉంటే చాలు: పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సు కండక్టర్‌కు తమ ఃనీట్ హాల్ టికెట్ః చూపిస్తే సరిపోతుంది. రూపాయి చార్జ్ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు.

రద్దీ రూట్లలో స్పెషల్ బస్సులు: ఎగ్జామ్ రోజున విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకునేలా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి, అక్కడ సాధారణ బస్సులతో పాటు అదనంగా ప్రత్యేక బస్సులను నడపనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు