Homeజాతీయంమూడేళ్లుగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు?.. కేంద్రానికి రాహుల్‌ గాంధీ ప్రశ్న

మూడేళ్లుగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు?.. కేంద్రానికి రాహుల్‌ గాంధీ ప్రశ్న

- Advertisement -

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కౌంటర్‌ ఇచ్చారు. 2023లోనే కాంగ్రెస్‌ పూర్తి మద్దతుతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తుచేశారు. మూడేళ్లు గడిచినా చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.‘పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మీకంటే ఈ విషయం గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు 2023లోనే కాంగ్రెస్‌ పూర్తి మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది్ణ అని రాహుల్‌గాంధీ ‘ఎక్స్‌్ణలో పేర్కొన్నారు.మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. 2023లో ఆమోదించిన చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని స్పష్టం చేశారు.మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పగలగాలని రాహుల్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. మహిళల సాధికారత రాజకీయాలు, వ్యాపారానికి మాత్రమే పరిమితం కావొద్దని అన్నారు. ఇళ్లు, కుటుంబాలు, బహిరంగ ప్రదేశాల్లోనూ మహిళలకు స్వేచ్ఛ ఉండాలని చెప్పారు. దీనిపై రిజిజు స్పందిస్తూ.. కాంగ్రెస్‌ వైఖరిలో మార్పు కనిపిస్తోందని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ బేషరతుగా మద్దతు ఇవ్వాలని కోరారు.2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ చట్టం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేలా రూపొందించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.

మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయాలంటూ 2026 ఏప్రిల్‌లో రాజ్యాంగ 131వ సవరణ బిల్లును తీసుకొచ్చారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ముందుగానే డీలిమిటేషన్‌ చేపట్టాలని ఇందులో ప్రతిపాదించారు. అయితే లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు