Homeజిల్లాలుఅనంతపురంప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

- Advertisement -

బొమ్మనహాళ్: మండలంలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటరమణ, తహసీల్దార్‌ రఘు, ఎస్‌ఐ నబీ రసూల్‌ సూచించారు. గురువారం బొమ్మనహాళ్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రజలతో పీస్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవ నిర్వాహకులు విగ్రహ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అనుమతుల కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని చెప్పారు. ఉత్సవాలకు మూడు రోజులపాటు మాత్రమే అనుమతి ఉంటుందని, మూడు రోజుల్లోనే విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు. గణేష్‌ విగ్రహాల ఊరేగింపులో అల్లర్లు, ఘర్షణలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎల్‌సీ ఏఈ అల్తాఫ్‌, ఆరోగ్య సిబ్బంది, విద్యుత్‌ శాఖ సిబ్బంది, ఆయా గ్రామాల గణేష్‌ ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు