లద్దాఖ్‌కి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేహ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఘర్షణలు చర్చనీయాంశంగా మారాయి.ఆ హింసాత్మక సంఘటనలకు నాయకత్వం వహించిన ఆరోపణతో లద్దాఖ్ ఉద్యమ నాయకుడు సోనం వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.ఈ నేపథ్యంలో, ఆయన భార్య గీతాంజలి జే ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ, తన భర్తను విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.అంతకుముందు గీతాంజలి జే ఆంగ్మో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్రమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.ఆ లేఖలో, సోనమ్ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేనని స్పష్టం చేశారు.అలాగే, వాంగ్‌చుక్ ఉద్యమ భావనను ధ్వంసం చేయడానికి కొన్ని పాక్షిక కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
ఆందోళనలకు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపు ప్రధాన కారణం
ఃనిర్బంధంలో ఉన్న నా భర్తను కలిసి, ఆయనతో మాట్లాడే హక్కు నాకు లేదా? ఈ కేసులో ఆయనకు న్యాయపరమైన హక్కులు కల్పించేందుకు నేను సాయం చేయకూడదా? సెప్టెంబరు 26న అరెస్టు చేసినప్పటినుంచి ఇంతవరకు నా భర్తతో నన్ను మాట్లాడనివ్వట్లేదు. కలవనివ్వట్లేదుఃః అని ఆమె ఆరోపించారు.
లేహ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 90 మందికి పైగా గాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ ఆధారంగా, ఈ ఆందోళనలకు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపు ప్రధాన కారణమని తేలింది.
అనంతరం ఆయనను జాతీయ భద్రతా చట్టం (చీూA) కింద అరెస్టు చేసి,రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జైలుకు తరలించారు.
ఈ చట్టం ప్రకారం, విచారణ లేకుండా 12 నెలలపాటు నిర్బంధం కొనసాగించడం సాధ్యమేనని అధికారులు తెలిపారు.
పాకిస్థానీ గూఢచారి అరెస్ట్
మరోవైపు, వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు లద్దాఖ్ డీజీపీ ఇటీవల వెల్లడించారు.వాంగ్‌చుక్‌కి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక పాకిస్థానీ గూఢచారిని ఇటీవల అరెస్టు చేసినట్లు కూడా వెల్లడించారు.


