Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోడ్డుకు మరమ్మతులు చేయించండి..

రోడ్డుకు మరమ్మతులు చేయించండి..

- Advertisement -

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్టిస్ట్ లేని నీస్ట్ లిబరేషన్) నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కదిరి గేట్ రైల్వే వంతెన నిర్మాణం కారణంగా వాహనముల రాకపోకలకు శివానగర్ మీదుగా సంగమేశ్వరం రోడ్డులో దారి మళ్లింపులు వలన ఇక్కడి ప్రాంత ప్రజలు, పాఠశాల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ ఉన్న గుంతలను పూడ్చి చక్కటి రోడ్డును నిర్మించాల్సినదిగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్ లిస్ట్-లేనినిస్ట్) ప్రిపరేషన్ నాయకులు పోలా లక్ష్మీనారాయణ, లక్ష్మయ్య, శివప్రసాద్, దేవేంద్ర, విశ్వనాథులు ఆర్డిఓ కార్యాలయంలోని ఏవో ఖతిజున్ కుప్రా కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కొద్దిరోజుల ముందే తాగునీటి పైపులైను పనులు చేయడం వలన తారు రోడ్డు పూర్తిగా దెబ్బతినిందని, రోడ్డు చదువునుగా లేక హెచ్చుతగ్గులు ఉండటం వల్ల మామూలుగానే ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఇదే దారిలో బస్సులు లారీలు, పెద్దపెద్ద వాహనాలు రాకపోకలు జరుగుతుండడంతో రెండు ప్రైవేటు స్కూల్స్ ఒక ప్రభుత్వ పాఠశాల ఉన్నదని విద్యార్థులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురి అయ్యే పరిస్థితిలు ఉన్నాయని వారు గుర్తు చేశారు. కావున రహదారి విషయంలో రోడ్డును చదును చేయాలని అదేవిధంగా పగటిపూట లారీలు పెద్ద పెద్ద భారీ వాహనాల రాకపోకలకు అనుమతి లేకుండా చేసి, రాత్రిపూట మాత్రమే తిరిగేలా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు