బంగారం ధర భారీగా పెరిగింది. పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్తగా 92 వేల రూపాయల ఎగువకు దూసుకెళ్లింది. బంగారం ధర భారీగా పెరగడంతో పసిడి ప్రియులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ఒక లక్ష రూపాయలు బంగారం దిశగా బంగారం దూసుకెళ్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బంగారం ధర భారీగా పెరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. . అలాగే ఈరోజు నమోదైన తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం సరికొత్త రికార్డును సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్లింది. తన పాత రికార్డులను చెల్లాచెదురు చేస్తూ బంగారం ధర ఏకంగా 92వేల రూపాయలపైన నమోదయింది. తాజాగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,010లుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,800లుగా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,03,950 పలికింది. బంగారం ధర పాత రికార్డులను పటాపంచాలు చేస్తూ కొత్త రికార్డును సృష్టించింది. ఈ ధర చూసి పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి బంగారం ధర తగ్గుతుందని అంతా భావించారు. కానీ ఉన్నపళంగా బంగారం ఇంతలాగా పెరుగుతుందని ఎవరు ఊహించలేదు.