Thursday, May 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినిరుద్యోగ యువతకు స్వర్ణావకాశం.. ఎంపీడీవో సాయి మనోహర్

నిరుద్యోగ యువతకు స్వర్ణావకాశం.. ఎంపీడీవో సాయి మనోహర్

విశాలాంధ్ర ధర్మవరం; రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో మే నెల 15వ తేదీ నుండి జూన్ నెల 13వ తేదీవరకు 30 రోజులపాటు పురుషుల కోసం సెల్‌ఫోన్ రిపేరీ లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి, ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శిక్షణ స్థలం ఆకుతోటపల్లి లో నిర్వహించబడునని తెలిపారు. మరిన్ని వివరాలకు అనంతపురం జిల్లా- 94925 83484 సెల్ఫోన్లో సంప్రదించవచ్చునని తెలిపారు.
ఈ శిక్షణకు 18 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు అర్హులు అని తెలిపారు. దరఖాస్తుదారులు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి అని తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కూడా కల్పించబడతాయి అని తెలిపారు.ఈ గొప్ప అవకాశాన్ని ధర్మవరం గ్రామీణ నిరుద్యోగ యువత పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ ద్వారా యువతకు స్వయం ఉపాధి సాధించే మార్గం ఏర్పడుతుంది అని తెలిపారు.కావున, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తు వెలుగులు వెలిగించుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కొరకు 94925 83484 ఈ నెంబర్ ద్వారా సంప్రదించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు