విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) మండల పరిధిలోని చిన్నతుంళం, బసలదొడ్డి, హెచ్ మురవణి, కంబదహాల్, కంబళదిన్నె, జాలవాడి, కల్లుకుంట, పెద్దకడబూరు తదితర గ్రామాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో ఉదయం ఆర్ సి ఎం చర్చి ఫాదర్ సంజీవరావు ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల గుండా సిలువ యాత్ర నిర్వహించారు . అనంతరం ఆయా చర్చీలలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ ముత్తు మనోహర్ బాబు, ఆర్సీఎం చర్చి ఫాదర్ సంజీవ్ రావు గుడ్ ఫ్రైడే సందేశమిచ్చారు. లోక కల్యాణం నిమిత్తం ఏసుక్రీస్తు సిలువలో అనేక శ్రమలకు ఓర్చి మానవాళికి విముక్తి కల్పించారని గుర్తు చేశారు. ఏసుక్రీస్తు సిలువలో వ్రేలాడుతూ పలికిన ఏడు మాటలపై వివరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో క్రీస్తు అడుగు జాడలలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యూత్ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.