ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మొత్తం రూ.40వేల కోట్ల విలువైన 62 పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టింది. ఇక పనుల ప్రారంభం కోసం సీఆర్‌డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచింది. మరో 11 పనులకు కూడా సీఆర్‌డీఏ అధికారులు టెండర్లు పిలిచే యోచనలో ఉన్నారు. అయితే, ఈ ప్రక్రియ కృష్ణా-గంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొనసాగే అవకాశం ఉందని సమాచారం. కాగా, అమరావతిలో పనులకు అభ్యంతరం లేదని గతంలోనే ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కానీ, టెండర్ల ప్రక్రియను మాత్రం ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది.
రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ప్రభుత్వం ఫోకస్.. మార్చి 15 నుంచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయం
RELATED ARTICLES