ప్రధానోపాధ్యాయులు నాగరాజు
విశాలాంధ్ర, కదిరి ; పట్టణంలోని వీవర్స్ కాలనీ గల మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించారని ప్రధానోపాధ్యాయులు నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పాఠశాలలో 166 మంది పరీక్షలు రాయగా 109 మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందన్నారు.ఇందులో భారత్ యాదవ్ (583)నవాజ్ (577) జోష్ణప్రియ (551) మార్కులు సాధించారని తెలిపారు.అంతేకాకుండా 500 మార్కులకు పైగా 16మంది విద్యార్థులకు రావడం జరిగిందన్నారు.ప్రధమ శ్రేణిలో 79,ద్వితీయ శ్రేణిలో 23, తృతీయ శ్రేణిలో 7మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. దీంతో మా పాఠశాల 66 శాతము సాధించడం జరిగిందన్నారు. ఉత్తీర్ణత చెందిన, ప్రతిభ కనపరిచిన విద్యార్థినీలకు ప్రధానోపాధ్యాయుడు నాగరాజుతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల అభినందనలు తెలియజేశారు