- Advertisement -
బాణాసంచా నిప్పులు కారణం గా కాలి బూడిదైన చెరకు తోట*
విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో వివాహం సందర్భన్గా వేసిన బాణా సంచా వల్ల నిప్పులు పడి చెరుకు తోట దగ్ధమై అగ్నికి ఆహుతి అయ్యింది. బల్లిపాడు కల్యాణ మండపం లో వివాహం సందర్భన్గా వేసిన తారాజువ్వలు పక్కనే ఉన్న చేరుకు తోటలో పడటం తో పూర్తిగా ఎండిపోయి కోయటానికి సిద్ధంగా ఉన్న చెరకు తోట కాలి బూడిద అయ్యింది. తాళ్లపూడి పోలీస్ సీబ్బంది, కొవ్వూరు నుండి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కల్యాణ మండపం, చెరకు తోట ఒకరిదే కావటం గమనార్హం. సుమారు 2 నుండి 3 లక్షలు నష్టం ఉంటుందని అంచనా.


