Homeఆంధ్రప్రదేశ్పిల్లలకు వైద్య పరీక్షలు

పిల్లలకు వైద్య పరీక్షలు

- Advertisement -

అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు వైద్య పరీక్షలు 

విశాలాంధ్ర – సీతానగరం: అంగన్వాడీ కేంద్రాల పిల్లలలో పోషకాహార లోపాలపై ఉన్న వైద్య పరీక్ష నిర్వహిస్తున్నామని మండల వైద్య అధికారి డాక్టర్ ఏ వి కే చైతన్య అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ జిల్లా అధికారుల, జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆదేశాల మేరకు మండలంలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా గురువారం సీతానగరం గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో 126 మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేయడం జరిగింది అని అన్నారు. ఈ పరీక్షలో 6 పిల్లల పోషకాహార లోపాలను గుర్తించి డి ఐ సి సెంటర్ కు రికమెండ్ చేయడం జరిగింది అని అన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 0 నుండి 5 సవంత్సరాల వయస్సు గల పిల్లలకు  వైద్య పరీక్షలు పది రోజులో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు