Monday, December 23, 2024
Homeజిల్లాలుఏలూరుఅసమానతలు లేని సమాజం కోసం పరితపించిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

అసమానతలు లేని సమాజం కోసం పరితపించిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

విశాలాంధ్ర ప్రతినిధి-ఏలూరు:అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటనలో కొనియాడారు. ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యాలయం సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన మహా మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎస్.సి. కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.అంబేద్కర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం,అభివృద్దే ధ్యేయంగా సమర్థవంతమైన పాలన చేస్తున్నట్లు ఆంజనేయులు తెలిపారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు,ఏలూరు నగర ఎస్.సి. సెల్ అధ్యక్షుడు పెద్దడా వెంకటరమణ, టిడిపి ఐదో డివిజన్ ఇన్ ఛార్జ్ దొడ్డిగర్ల సుభా మల్లిక్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు