- Advertisement -
విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం ఆర్టీసీ బస్టాండ్ సమీపాన గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి గ్రామానికి చెందిన నర్సరీ రైతు కందుకూరు సత్యనారాయణ పద్నాలుగు వేల రూపాయల విలువచేసే గ్రైండర్ ను గురువారం బహుకరించారు. భక్తులు, గ్రామస్తుల సహకారంతో ప్రతి గురువారం ఆలయం వద్ద సుమారు వందమంది భక్తులకు ఉచిత అన్నదానం ఉంటుందని, ఈ కార్యక్రమ నిర్వహణకు గ్రైండర్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆలయ పూజారి వేదాంతం నాని, కమిటీ సభ్యులు ఎం దొరబాబు లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు, టి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.


