Homeఆంధ్రప్రదేశ్తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో జీఎస్ఎల్ విద్యార్థికి చోటు అభినందనీయం

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో జీఎస్ఎల్ విద్యార్థికి చోటు అభినందనీయం

- Advertisement -

– జీఎస్ఎల్ విద్య సంస్థలు అధినేత డాక్టర్ గన్ని భాస్కరరావు 

విశాలాంధ్ర – రాజానగరం : అతిచిన్న వయస్సులోనే మధుమేహం పై విశేషమైన అధ్యయనం చేసి “పీర్-రివ్యూడ్ జర్నల్‌” కు పరిశోధనా పత్రాన్ని సమర్పించిన తమ కళాశాల విద్యార్ది గడుగొయ్యల గుణశ్రీ ఫణి అజయ్ కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కడం అభినందనీయమని జీఎస్ఎల్ విద్య సంస్థలు అధినేత డాక్టర్ గన్ని భాస్కరరావు అన్నారు. మండలం లోని జీఎస్ఎల్ వైద్య కళాశాల నందు ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం అజయ్ మధుమేహం ఎఫ్ఈవి1 ప్లేట్‌లెట్ పారామీటర్ల పై ఫిజియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ టి.కవిత మార్గదర్శకత్వంలో పరిశోధన చేశారన్నారు.ఇటీవలే సీఎంసీ వేలూరులో జరిగిన ఎండోక్రినాలజీ అంతర్జాతీయ సదస్సులో సమర్పించగా, సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించబడింది అని చెప్పారు.దీంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తమ విద్యార్ధిని వరించిందని చెప్పారు. 19 ఏళ్లు ప్రాయంలోనే ఇతంటి విజయం సాధించినందుకు శ్రీ ఫణి అజయ్‌ను జీఎస్ఎల్ విద్యా సంస్థలు అధినేత డాక్టర్ గన్ని భాస్కరరావు,మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గన్ని సందీప్,ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కె. మిశ్రా,వివిధ శాఖల అధిపతులు తదితరులు అభినందించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు