Friday, January 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపాత్రికేయుల పట్ల గుంతకల్ ఎమ్మెల్యే జయరాం వ్యాఖ్యలు విచారకరం

పాత్రికేయుల పట్ల గుంతకల్ ఎమ్మెల్యే జయరాం వ్యాఖ్యలు విచారకరం

బహుజన్ సమాజ్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం::పాత్రికేయుల పట్ల ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు విచారకరం అని బహుజన్ సమాజ్ పార్టీ ధర్మవరం ఇంచార్జి సాకే వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పాత్రికేయుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఎమ్మెల్యే దుర్భాషనలు, జర్నలిస్టులకు బెదిరింపు హెచ్చరికలు పత్రికా స్వేచ్చ, ప్రజాస్వామ్య సూత్రాలపై దాడి అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు జవాబుదారీగా ఉండాలన్నారు. జర్నలిస్టుల హక్కులను గౌరవించడం, రక్షించడం ప్రజా ప్రతినిధుల విధి అన్నారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు