Saturday, February 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ సత్య సాయి జిల్లా జూనియర్ సీనియర్ మహిళల హాకీజట్ల ఎంపిక పోటీలు..

శ్రీ సత్య సాయి జిల్లా జూనియర్ సీనియర్ మహిళల హాకీజట్ల ఎంపిక పోటీలు..

ఏపీ హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సూర్యప్రకాష్.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా జూనియర్, సీనియర్ మహిళ హాకీ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, హాకీ శ్రీ సత్యసాయి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ హాకీ పోటీలలో పాల్గొనుపోవు జూనియర్ క్రీడాకారులు 01-01-2006 తర్వాత, సీనియర్ క్రీడాకారులు 01-01-1996 తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. ఆసక్తిగల హాకీ క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని హాకీ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు