ఆర్గనైజింగ్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేట-రాంనగర్ లో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఫిబ్రవరి 8వ 9వ తేదీలలో రెండు రోజులపాటు ఏడవ స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి జాకీర్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో యువర్ ఫౌండేషన్ కమిటీ వారు సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూందని మొత్తం నగదు బహుమతి 60 వేల రూపాయలు ఉంటుందని, ప్రవేశ రుసుము 600 రూపాయలు ఉంటుందన్నారు. ఈ రెండు రోజులు పాటు చెస్ క్రీడాకారులకు ఉచిత భోజనం ,వసతి కూడా ఉంటుందని తెలిపారు. ఈ చెస్ట్ టోర్నమెంట్ పోటీలు నియమ నిబంధనల ప్రకారం నిర్వహించబడునని తెలిపారు. ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రవిరాజ్, గవర్నమెంట్ హానేబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ బి వి సుబ్బారావు హాజరవుతారని తెలిపారు. ఈ చెస్ టోర్నమెంట్ ఏపీ స్టేట్ అసోసియేషన్ కార్యదర్శి సుమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. అండర్-9,7,11,13,15 లోగల 50 మందికి ప్రోత్సాహంగా బహుమతులతో పాటు చిన్నారులకు మెడల్స్ కూడా ఇవ్వబడునని తెలిపారు. ఈ చెస్ టోర్నమెంట్లో 41 మందికి 60 వేల రూపాయల మొత్తమును నగదు బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల చెస్ క్రీడాకారులు సెల్ నెంబర్ 9912647370 కు గాని ల్యాండ్ నెంబర్ 08559-2218132 సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం ,కోశాధికారి మోహన్, చాంద్ భాషా, టోర్నమెంట్ ఆర్గనైజర్ డైరెక్టర్ పురుషోత్తం, కోటేశ్వరరావు, ఇద్దరు పాల్గొన్నారు.
ఏడవ స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ట్ టోర్నమెంట్..
RELATED ARTICLES