Monday, February 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపెన్షన్ లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులు, హెల్త్ సర్టిఫికెట్ల పునః పరిశీలన కార్యక్రమం..

పెన్షన్ లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులు, హెల్త్ సర్టిఫికెట్ల పునః పరిశీలన కార్యక్రమం..

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం:: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈనెల 21 నుండి 22వ తేదీ వరకు రెండు రోజులు పాటు పింఛనుదారుల ఆరోగ్య పరిస్థితులు, హెల్త్ సర్టిఫికెట్లను పునః పరిశీలన చేయడానికి వైద్యుల బృందం పింఛనుదారుల కుటుంబాలను సందర్శించడం జరుగుతుందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యుల బృందం తాము తెలిపిన షెడ్యూల్ తేదీలలో వారి పర్యటన ఉంటుందని తెలిపారు. ఇదివరకే పింఛన్దారులకు నోటీసు పంపడం జరిగిందని, నోటీసు అందుకున్న పింఛన్దారులు ఇంటి వద్దనే ఉండి, వైద్యుల బృందానికి సహకరించాలని తెలిపారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని తెలపడం జరిగిందన్నారు. మండల పరిధిలోని ఏలుకుంట్ల, నేలకోట, దర్శనమల, రావులచెరువు, ధర్మపురి, మల్లా కాలువ, సిసి కొత్తకోట లో గల 20 మంది పింఛన్దారులు ఈనెల 21వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం రేగాటిపల్లి, కునుతూరు, పోతుకుంట, చిగిచెర్ల, గోట్లూరు-1, అండ్ 2, తుమ్మల గ్రామాలకు ఈనెల 22వ తేదీన 26 మంది పింఛన్దారులకు పరిశీలన ఉంటుందని తెలిపారు. ఆర్థోపెడిషియన్ వైద్యులు- డాక్టర్ శివకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ సర్జన్- డాక్టర్ ఎం. సుమలత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటి వద్దకు వస్తారని తెలిపారు. కావున పింఛన్దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు