పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా శ్మశానాన్ని తలపిస్తోంది. వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయడం, పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయడం జరుగుతోంది. అయితే, ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడంలో హమాన్ చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… శనివారంలోపు బందీలను అందరినీ ఓకేసారి విడుదల చేయాలని… లేకపోతే హమాస్ కు నరకం చూపిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హమాస్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ స్పందిస్తూ… శనివారం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని చెప్పారు. అల్ జజీరాతో తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అంగీకరించిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని… ఒకేసారి బందీలను విడుదల చేసే ప్రసక్తే లేదని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని… అందుకే బందీల విడుదలలో జాప్యం జరుగుతోందని తెలిపారు.
ట్రంప్ వార్నింగ్ కు హమాస్ బేఖాతరు
RELATED ARTICLES