విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ప్రతి నెల ఒకటవ తేదీ వచ్చేసరికి పింఛన్‌దారుల కళ్ళల్లో ఆనందం వెదజల్లుతుందని టిడిపి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు దొడ్డపనేని దుర్గాదేవి పేర్కొన్నారు. స్థానిక ఎనిమిదో వార్డులో కాశీ కనకదుర్గమ్మ అనే మహిళకు భర్త చనిపోయినప్పటికీ పింఛను రాకపోవడంతో, టిడిపి పట్టణ అధ్యక్షుడు జేష్ఠ రామకృష్ణారావు కు విన్నవించుకోగా , వితంతువు పెన్షన్ కు ఆమె అర్హులే అని అధికారుల కు తెలియజేగా, అధికారులు దర్యాప్తు చేపట్టి ఆమెకు నూతన పింఛను మంజూరు చేయడంతో ఆమె పింఛన్ తీసుకోవడం జరుగుతుందని దుర్గాదేవి తెలిపారు. పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూటమి ప్రభుత్వ పరిపాలనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొత్త రమ, సచివాల సిబ్బంది పాల్గొన్నారు.


