విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో (మెయిన్ ) నందు మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారులు సువర్ణ సునియం, రామ్మూర్తి మరియు ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ విద్యార్థులకు దీటుగా దివ్యాంగ విద్యార్థులు ఎదుగుతున్నారని, ప్రతి తల్లిదండ్రులు దివ్యాంగ విద్యార్థులను భవితి సెంటర్ కు పంపించాలని కోరారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుందని ఎస్కార్ట్, ట్రాన్స్ పోర్ట్, స్టైఫండ్, హోమ్ బేస్డ్ అలవెన్స్ లు కల్పిస్తుందని తెలిపారు . థామస్ ఆల్వా ఎడిషన్, స్టీఫెన్ హాకింగ్, లూయీ బ్రెయిలీ వంటి వారు దివ్యాంగులు అయినప్పటికీ శాస్త్రవేత్తలుగా రాణించారని, బెస్ట్ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి దివ్యాంగుడేనని అన్నారు. వారు ఏనాడు కూడా తన అవిటితనాన్ని లెక్క చేయక ముందుకు సాగి విజయం సాధించారని అన్నారు. ఎంతోమంది దివ్యాంగులు ప్రభుత్వ పదవులలో చేరి తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారని అన్నారు. దివ్యాంగులను అడ్డపేర్లతో పిలువ రాదని అలా అడ్డపేర్లతో పిలిచినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయన్నారు .
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి ఆశాజ్యోతి,ఎంఐఎస్ కో ఆర్డినేటర్ లక్ష్మన్న, సి ఆర్ పి కృష్ణ ఆచారి, ఉపాధ్యాయుల కేశవ, ఐ.ఈ.ఆర్.టీ. ( సహిత విద్య ఉపాధ్యాయులు ) ఎర్రకోట గోపాల్, సుబ్బరాయుడు విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.