విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102 జయంతి వేడుకలను స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బర్త్డే కేక్ ను కట్ చేసి పిల్లలకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దేశంలోనే మొట్టమొదటిసారిగా రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టి పేదల మనసు దాచుకున్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు రామకృష్ణ, హనుమంతు రెడ్డి, అక్బర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.